సామాజిక కార్యక్రమాలు

  1. Home
  2. /
  3. సామాజిక కార్యక్రమాలు

స్కైటేల్స్ by CCMB

CCMB లో చర్చించే వివిధ విషయాల మీద వ్యాసాలు, జైన్స్, వీడియోలు, పాడ్ కాస్టులు ఇంకా ఎన్నో ఎన్నో ఇక్కడ చూడండి.

షాడో ఏ సైంటిస్ట్

CCMBలో అనేక విద్యార్థి-కేంద్రీకృత కార్యక్రమాలలో పాల్గొనేందుకు మేము ఉత్సాహవంతులైన హైస్కూల్ విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తున్నాము. దీనిలో భాగంగా ‘షాడో ఎ సైంటిస్ట్’ అనే ప్రోగ్రాం ని క్రితం సంవత్సరం మొదలుపెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా గ్రేడ్ 8 – 12 హైస్కూల్ విధ్యార్ధులు CCMB లో తమకు నచ్చిన ల్యాబ్‌ లో ఒక రోజంతా సైంటిస్టులతో గడపవచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒక నిర్ణీత ఫారమ్‌ను పూరించినట్లైతే, ల్యాబ్‌కు మరియు విద్యార్ధులకు అనుకూలమైన తేదీని నిర్ణయిస్తారు. ఈ ప్రోగ్రాం CCMB లో చేసే శాస్త్రీయ పరిశోధన గురించి తెలుసుకోవడానికి, సైంటిస్టులతో వివిధ విషయాల మీద ధైర్యంగా చర్చించడానికి, విధ్యార్ధులందరికి ఒక గొప్ప వనరు.

సూపర్‌బగ్స్‌కు వ్యతిరేకంగా సూపర్‌హీరోస్

ఈ శతాబ్దపు అత్యంత ప్రధానమైన ఆరోగ్య సంరక్షణ సవాళ్లలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ లేక యాంటీబయాటిక్ ల రోగనిరోధకత క్షీణత ఒకటి. గడచిన శతాబ్దం లో, జఠిలమైన రోగాలు ప్రబలినప్పుడు వాటి నివారణలో యాంటీబయాటిక్స్ పాత్ర ఎంతో చెప్పలేనిది. కానీ వాటి రోగనిరోధకత ఇప్పుడు రాను రానూ క్షీణించడం అన్నది మానవాళి మనుగడ కి పెను సవాలైనా, ఈ వార్త ప్రస్తుత ప్రపంచంలో పెద్దగా చర్చనీయాంశం కాకపోవడం చాలా ఆశ్చర్యకరం.

“సూపర్‌బగ్స్‌కు వ్యతిరేకంగా సూపర్‌హీరోస్” ప్రొగ్రాం ద్వారా మేము దేశంలోని మాధ్యమిక పాఠశాల విద్యార్థులతో వర్క్‌షాప్‌లను నిర్వహించడానికి పాఠ్య ప్రణాళికలను అభివృద్ధి చేసాము మరియు నగరంలోని కొంతమంది విద్యార్థులతో వర్క్‌షాప్‌లను కూడా నిర్వహించాము. యాంటీబయాటిక్ వినియోగిత గురించి, త్వరితంగా నిర్ణయాత్మకమైన శక్తి గా మారబోయే ఈ చిన్నారులను చైతన్య పరచి, వారి మధ్య నుండి ఈ విపత్తుని ఎదుర్కోగలిగే బుద్ధిశాలులని తయారు చెయ్యడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇంకా ఈ చిన్నారులు, వారి తల్లి తండ్రులలో, పెద్దలలో కూడ చైతన్యం తీసుకు రాగలరని విశ్వసిస్తున్నాము. ఈ ప్రోగ్రాం లక్ష్యాలను ఇతర నగరాలకు కూడా చేరవేయడానికి, సమర్ధులైన శిక్షకులను తయారు చేస్తున్నాము. భారత దేశ సామాజిక పరిస్థితులకు అనుకూలంగా, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి అవగాహన కల్పించి, చైతన్య పరిచే వీడియోలు రూపొందిస్తున్నాము.

యువ నూతనావిష్కరణ కర్త (YIP)

“యువ నూతనావిష్కరణ కర్త” ప్రోగ్రాం ద్వారా, గత 7 సంవత్సరాలుగా, విద్యార్ధులు CCMB శాస్త్రవేత్తలతో కలిసి నూతనావిష్కరణల మీద తర్కించే వేదికను కల్పిస్తోంది. ఈ పరిచయం విద్యార్ధులను చిన్న వయసు నుండే సైన్స్ పట్ల మక్కువని, మానవాళి ప్రస్తుతం ఎదుర్కొంటున్న, ఎదుర్కోబోయే సమస్యల పట్ల అవగాహనని పెంచి వారిని భావి శాస్త్రవేత్తలుగా మారేలా బీజం నాటుతోంది.

గత సంవత్సరం 200 మంది విద్యార్ధులు ఈ ప్రోగ్రాం లో హైదరాబాదు మరియు చుట్టుపక్కల జిల్లాల నుండి నమోదు చేసుకుంటే, వారిలో 10 శాతం మందిని లిఖిత పరీక్ష ద్వారా 2 వారాల శిక్షణ కోసం ఎంపిక చెయ్యడం జరిగింది. ఈ శిక్షణా సమయంలో, ఈ విద్యార్ధులు యువ మరియు సీనియర్ శాస్త్రవేత్తలతో ఒకేలా కలిసి చర్చించే అవకాశం దొరుకుతుంది. ఈ శిక్షణా సమయంలో, విద్యార్ధులు యువ మరియు సీనియర్ శాస్త్రవేత్తలతో ఎటువంటి భేషజాలు లేకుండా ఒకేలా కలిసి చర్చించే అవకాశం దొరుకుతుంది. ఈ చర్చల్లో తరచుగా – ఏఏ అంశాలు తమని నూతనావిష్కరణల వైపు చైతన్యపరచి ఉత్తేజింపచేస్తాయో, ఏ విధంగా ఒక సమస్యని శాస్త్రీయ పద్దతిలో విశ్లేషించి సమాధానాలు రాబట్టాలో, ఇంకా ముందుగా ఒక సమస్యని బహు కోణాల్లో ఆలోచించి పూర్తి సమస్యని ఎలా ఆవిష్కరించాలో, ఇప్పటి శాస్త్రవేత్తలు భావి శాస్త్రవేత్తలకు వివరించడం కనపడుతుంది. ఇవే కాకుండా, విద్యార్ధులు చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ, కొత్త కొత్త పరికరాలని తయారు చేస్తూ పొందే వింత అనుభూతిని, తీపి అనుభవాలని వర్ణించనలవి కాదు.

ప్రోగ్రాం ద్వారా విద్యార్ధులకి సైన్స్ గురించి నూతనంగా ఎలా అలోచించాలో అనుభవంగా నేర్పించడం జరుగుతుంది. ఉదాహరణకి పిల్లలు కాల్పనిక (ఫిక్షన్) రచయితలు అయితే దానిలో సైన్స్ ని జోడించడం వల్ల వారి రచనకి నిబద్దత ని ఎలా తీసుకురావొచ్చో లేక ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యల పట్ల/ యాంటిబయాటిక్ రెసిస్టన్స్ పట్ల పర్యావరణ శాస్త్రవేత్తలు ఎలా స్పందిస్తారు, వన్యప్రాణుల జీవశాస్త్రవేత్తలు ఎలా స్పందిస్తారు, మైక్రోబయాలజిస్ట్లులు అయితే ఎలా స్పందిస్తారు లాంటి విభిన్న దృక్పథాలని అనుభవపూర్వకం నేర్చుకోవడం జరుగుతుంది.

ఈ ప్రోగ్రాం మొదలు పెట్టిన తర్వాత, విద్యార్ధుల తల్లి తండ్రులనుండి, అధ్యాపకుల నుండి వచ్చిన అభిప్రాయాల ప్రకారం జీవ శాస్త్రం పట్ల వారి పిల్లల దృష్ఠి కోణం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు జీవ శాస్త్రాన్ని ఒక పాఠం లా చదివే పిల్లలు, ఇప్పుడు తమ చుట్టూ ప్రకృతి లో వున్న జీవాలని, వాటి మధ్య వున్న వైవిధ్యాలని లోతుగా పరిశీలించడం, విభేదాలని తర్కించడం, శాస్త్రీయ పద్దతిలో వివరించడం వారి ఉపాధ్యాయులు గమనించారు. గత కొన్ని సంవత్సరాలుగా తల్లి తండ్రుల, అధ్యాపకుల నుండి వస్తున్న విజ్ఞాపనలను బట్టి “యువ నూతనావిష్కరణ కర్త” ప్రొగ్రాం ని దేశమంతటికి విస్తరించవలసిన ఆవశ్యకత కనపడుతోంది.

హిందీ - జిజ్ఞాస

ప్రతి సంవత్సరం హిందీ భాష లో, CCMB లో వార్షిక సైన్స్ పత్రిక – జిజ్ఞాస ముద్రింపబడుతుంది. ఈ పత్రిక లో ఆ సంవత్సరంలో శాస్త్రవేత్తలని, మానవాళిని ఉత్తేజపరచిన ఏదైన అంశం మీద వివిధ విషయాల కూర్పుగా ప్రచురితమౌతుంది. గత సంవత్సరం “ఓమిక్స్” అనే అంశం మీద, కణ అణు జీవ విజ్ఞాన శాస్త్రం లో పెద్ద ఎత్తున జరుగుతున్న పరిశోధనల గురించి వివిధ వ్యాసాలు ప్రచురింపబడ్డాయి.

ఇవే కాకుండా, మన దేశం లో ప్రచురితమయ్యే వివిధ సైన్స్ పత్రికలలో CCMB లో జరిగే పరిశోధనల మీద వివిధ వ్యాసాలు ముద్రితమౌతాయి. గత సంవత్సరం దక్షిణ బెంగాల్ నుండి ముద్రితమయ్యే బిగ్యాన్ అనే సైన్స్ పత్రిక లో మరియు మణిపూర్ నుండి ముద్రితమయ్యే రేడియో లోక్ తక్ లో వివిధ విషయాల్లో CCMB నుండి ప్రచురణలు పంపబడ్డాయి.

Notifications