జోనకి
- Home
- /
- సహాయ వ్యవస్థలు
- /
- జోనకి
బోర్డ్ ఆఫ్ రేడియేషన్ & ఐసోటోప్ టెక్నాలజీ (BRIT), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ద్వారా ఏర్పాటు చెయ్యబడిన లేబుల్ చేయబడిన బయోమోలిక్యూల్స్ లాబొరేటరీ, JONAKI అనే అత్యుత్తమ లేబొరేటరీ. ఇది సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ (CCMB) క్యాంపస్‌లో ఉంది. దేశంలోని బయోటెక్నాలజిస్టులు, మాలిక్యులర్ బయాలజిస్టులు మరియు ఇతర లైఫ్ సైన్స్ రీసెర్చ్ సైంటిస్టులకు లేబుల్ చేయబడిన బయోమాలిక్యూల్స్ మరియు విభిన్న మాలిక్యులర్ బయాలజీ కిట్‌లను అందించడానికి BRIT నిబద్ధత గా పని చేస్తుంది. ఈ ప్రయోగశాల నుండి డజనుకు పైగా 32P / 33P లేబుల్ చేయబడిన న్యూక్లియోటైడ్‌లు మరియు మాలిక్యులర్ బయాలజీ కిట్‌లు దేశవ్యాప్తంగా వివిధ జాతీయ ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు పరిశ్రమలకు క్రమ పద్ధతిలో సరఫరా చేయబడతాయి. జీవశాస్త్రం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, వైద్య శాస్త్రాలు, బయోటెక్నాలజీ మరియు జన్యు ఇంజనీరింగ్‌లలో జరిగే ఆధునిక పరిశోధనలకి రేడియో ఐసోటోప్ తో లేబుల్ చేయబడిన న్యూక్లియోటైడ్‌లు అత్యంత కీలకం. 33P లేబుల్ చేయబడిన న్యూక్లియోటైడ్, రేడియో ఐసోటోపిక్ మరియు నాన్-ఐసోటోపిక్ లేబుల్‌ల మధ్య వంతెనగా పరిగణించబడుతుంది. ఇది సిటు హైబ్రిడైజేషన్, DNA సీక్వెన్సింగ్ మరియు DNA చిప్-ఆధారిత జన్యు వ్యక్తీకరణ అధ్యయనాలకు అనుకూలమైన సాధనం. ఇటువంటి కీలకమైన న్యూక్లియోటైడ్ ప్రస్తుతం ఈ ప్రయోగశాలలో తయారు చేయబడి, దేశంలోని వివిధ వినియోగధారులకు సరఫరా చేయబడడం ఎంతో గర్వకారణం.
నగరంలోని ఆసుపత్రుల న్యూక్లియర్ మెడిసిన్ కోల్డ్ కిట్‌ల అవసరాలు తీర్చడం కోసం, JONAKI ఒక సంవత్సరం క్రితం రిటైల్ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా, PCR యాంప్లిఫికేషన్ కిట్‌లు, న్యూక్లియోటైడ్ మిక్స్ మరియు Taq DNA పాలిమరేస్‌లను వ్యక్తిగత అవసరాలకోసం పోటీ ధరతో ప్రవేశపెట్టింది. ఈ రెండు మోడల్స్ మంచి విజయం సాధించడం చాలా ఆనందకరం.
JONAKI తను అందించే ఉత్పత్తులు మరియు సేవల యొక్క అత్యుత్తమమైన నాణ్యత ప్రమాణాలని నిలకడగా ఉంచడానికి తన పనితీరును నిరంతరం మెరుగు పరచుకుంటూ ఉంటుంది మరియు దాని సిబ్బంది నిరంతరం ఈ దిశలో పని చేస్తారు అని చెప్పడం చాలా సముచితము. ఈ వ్యవస్థ చే సరఫరా చేయబడే అన్ని 32P/33P న్యూక్లియోటైడ్‌లు చాలా మంచి స్వచ్ఛత, మెరుగైన స్థిరత్వం మరియు నిర్దిష్ట కార్యాచరణతో పని చేస్తున్నాయి. మాలిక్యులర్ బయాలజీ ఉత్పత్తులైన Taq DNA పాలిమరేస్ మరియు మాలిక్యులర్ బయాలజీ కిట్‌లు కూడా మంచి స్థిరత్వం,పనితీరుతో సరఫరా చేయబడుతున్నాయి. ఇటువంటి కఠినమైన లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవడానికి, CCMB ప్రాంగణంలో లభించే మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధికి తోడ్పడే శాస్త్రీయ వాతావరణం JONOKI కి ఎంతో ఉపకరిస్తుంది.
JONOKI తన జెల్ ఆధారిత TB-PCR కిట్‌ను ఆగస్టు 2008లో ప్రారంభించడం ద్వారా మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ వ్యాపార రంగంలోకి కొత్తగా ప్రవేశించింది. ఇంకా సరసమైన ధరలలో సిలికా పొర ఆధారంగా పనిచేసే న్యూక్లియిక్ యాసిడ్ ప్యూరిఫికేషన్ కిట్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ఇటు మాలిక్యులర్ బయాలజిస్ట్‌లకు అటు దేశవ్యాప్తంగా ఉన్న మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ సమాజానికి నాణ్యత తో రాజీ పడకుండా సేవ చేయడం జరుగుతోంది. ఇదే ఒరవడి లో DNA డయాగ్నోస్టిక్స్ మరియు ELISA డయాగ్నస్టిక్స్ రంగంలో తన కార్యకలాపాలను విస్తరించడానికి JONOKI సిద్ధమవుతోంది. మరింత మెరుగుదల కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. TB-PCR-ELISA కిట్ మరియు రియల్ టైమ్ TB-PCR కిట్ క్లినికల్ ట్రయల్‌లో ఉన్నాయి మరియు త్వరలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. మానవ థైరాయిడ్ హార్మోన్ T3 కోసం ELISA కిట్ క్లినికల్ ట్రయల్‌లో ఉంది మరియు త్వరలో ప్రారంభించబడుతుందని కూడా భావిస్తున్నారు.