ప్రొఫైల్

  1. Home
  2. /
  3. ప్రొఫైల్

సియస్ఐఆర్ – కణ మరియు అణు జీవవిజ్ఞాన కేంద్రం (సిసిఎంబి), ఆధునిక జీవశాస్త్ర పరిశోధనలలో కొత్త ఒరవడి సృష్టిస్తూ, ప్రముఖ పరిశోధనా కేంద్రంగా తనకంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకుంది. ప్రాధమిక పరిశోధన మరియు శిక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఇతర కేంద్ర పరిశోధనా సంస్థలతో కలిసి జీవ శాస్త్ర మరియు అనుబంధ శాస్త్రాల మధ్య నూతన పరిశోధనలకు శ్రీకారం చుట్టడం అనే లక్ష్యాలతో నిరంతరం కృషి చేస్తోంది.

మొట్టమొదటిగా ఏప్రిల్ 1, 1977 వ సంవత్సరంలో అప్పటి రీజినల్ రీసర్చ్ ఇన్స్ టిట్యూట్ (ప్రస్తుత ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) యొక్క జీవరసాయన విభాగాన్ని, కణ మరియు అణు జీవవిజ్ఞాన కేంద్రం (సిసిఎంబి) గా పునః నామకరణంతో పరిమిత స్వయంప్రతిపత్తి సంస్థగా ఏర్పాటు చెయ్యడం జరిగింది. కొత్తగా ఏర్పడిన ఈ సంస్థకి డా. పి.ఎం. భార్గవ తొలి డైరక్టరు గా నాయకత్వం వహించారు. దీనికి పూర్వ పీఠికగా, వైజ్ఞానిక మరియు పారిశ్రామిక అనుసంధాన పరిషత్ (సియస్ఐఆర్) యొక్క పాలక మండలి 1976 వ సంవత్సరంలో, ఆధునిక జీవ శాస్త్ర రంగం మరియు దాని వివిధ అనుబంధ రంగాలలో జరగవలసిన పరిశోధనల విశిష్ఠత ను గుర్తించి, అత్యుత్తమ విలువలతో మరియు లక్ష్యాలతో స్థాపించబూనిన సిసిఎంబి ఏర్పాటు ప్రతిపాదనను అనుమతించింది.


ఈ సంస్థ స్థాపించిన నాటి నుండి, అంచలంచెలుగా తన లక్ష్యాలను ఎప్పటికప్పుడు అధిగిమిస్తూ, ఏర్పడిన 5 సంవత్సరాలలోనే పరిపక్వతను సాధించి, పూర్తి ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు వైజ్ఞానిక సలహా మండలి ఏర్పాటు తో 1981-1982 సంవత్సరం లో స్వయంప్రతిపత్తిని సాధించుకుని వైజానిక ప్రపంచం ముందు తనను తాను ఆవిష్కరించుకుంది. పెరుగుతున్న లక్ష్యాలతో పాటు, అవసరాలు తోడై, కణ మరియు అణు జీవవిజ్ఞాన కేంద్రం (సిసిఎంబి) విశాలమైన తనదైన కొత్త ప్రాంగణం లోకి మారాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. .

Notifications