పరిశోధనా ప్రాంగణాలు

  1. Home
  2. /
  3. పరిశోధనా ప్రాంగణాలు

ప్రధాన పరిశోధనా ప్రాంగణం

హబ్సిగూడలోని ప్రధాన పరిశోధనా ప్రాంగణం 1987లో ఛ్ఛంభ్ యొక్క మొదటి స్వతంత్ర ప్రాంగణం గా స్థాపించబడింది. ఈ ప్రాంగణం లో జరిగే పరిశోధనలు జీవశాస్త్రంలో ఉత్పన్నమయ్యే ప్రాథమిక ప్రశ్నలపై అన్వేషణాత్మక దృష్టి పెడతాయి. ఇది దేశవ్యాప్తంగా పరిశోధకులకు అందుబాటులో ఉండే అనేక కేంద్రీకృత పరిశోధనా సౌకర్యాలను కూడా కలిగి ఉంది.

అనుబంధ ప్రాంగణం-I (LaCONES)

2000 samvatsaram లో అంతరించిపోతున్న జాతుల సంరక్షణ కోసం oka అనుబంధ ప్రయోగశాల (LaCONES) అత్తాపూర్‌లో స్థాపించబడింది. LaCONES లోని శాస్త్రవేత్తలు జీవావరణ శాస్త్రం మరియు వన్యప్రాణుల ప్రవర్తనను అధ్యయనం చేస్తారు మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం అధునాతన పరమాణు జీవశాస్త్ర సాధనాలను అభివృద్ధి చేస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని జంతుప్రదర్శనశాలలలో మరణించిన జంతువుల నుండి జన్యు పదార్థాన్ని సేకరించి నిల్వ చేయడానికి నేషనల్ జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్ ఫెసిలిటీని కూడా ఇది కలిగి ఉంది.

అనుబంధ ప్రాంగణం-II (మెడికల్ బయోటెక్నాలజీ కాంప్లెక్స్)

ఉప్పల్‌లోని మెడికల్ బయోటెక్నాలజీ కాంప్లెక్స్ 2015 లో CCMB యొక్క రెండవ అనుబంధ ప్రయోగశాల గా స్థాపించబడింది. ఈ ప్రయోగశాల CCMB మరియు స్టార్ట్-అప్ కంపెనీల శాస్త్రవేత్తలచే సాంకేతిక అభివృద్ధికి అంకితం చేయబడింది. ఇది ప్రస్తుతం కామన్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ హబ్ (CRTDH), అటల్ ఇంక్యుబేషన్ సెంటర్-CCMB (AIC-CCMB) మరియు మెయిటీ స్టార్టప్ హబ్‌లలో వివిధ రంగాలలో నిమగ్నమై ఉన్న 20 కంటే ఎక్కువ స్టార్టప్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ ప్రాంగణం CCMB యొక్క మాలిక్యులర్ మరియు క్రోమోజోమ్ డయాగ్నస్టిక్ సౌకర్యాలకి నిలయం మరియు CCMB ద్వారా నిర్వహించబడే అనేక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు వేదిక.

Notifications