ఫైన్ బయోకెమికల్స్

  1. Home
  2. /
  3. సహాయ వ్యవస్థలు
  4. /
  5. ఫైన్ బయోకెమికల్స్

ఫైన్ బయోకెమికల్స్ విభాగం CCMB లో జరిగే పరిశోధనలకు కావలసిన బయోకెమికల్స్ & మాలిక్యులర్ బయాలజీ కిట్‌ల గిడ్డంగి వ్యవస్థని నిర్వహిస్తుంది. ఈ విభాగంలో శీతల గది (+4°C), డీప్ ఫ్రీజర్‌లు (-20°C), వాక్-ఇన్ ఫ్రీజర్ (-20°C) మరియు రసాయనాల నిల్వ కోసం ఒక అల్ట్రా డీప్ ఫ్రీజర్ (-70°C) ఉన్నాయి. గది ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉండే రసాయనాలు 28 ° C వద్ద నిర్వహించబడే ఉష్ణోగ్రతతో ఒక గదిలో ఉంచబడతాయి. ఫైన్ బయోకెమికల్స్‌ విభాగంలో అమినో యాసిడ్‌లు, ప్రొటీన్లు, ఎంజైమ్‌లు, ప్యూరిఫికేషన్ కిట్‌లు మరియు బఫర్ రియాజెంట్‌లు నిల్వ చేయబడతాయి. ఇవే కాకుండా, ఎంజైమ్‌లు, యాంటీబాడీలు, రీకాంబినెంట్ ప్రోటీన్‌ల శుద్ధి మరియు గుర్తింపు కోసం కిట్‌లు, ఎలెక్ట్రోఫోరేసిస్ కోసం రియాజెంట్‌లు, PCR, RT-PCR, బఫర్‌లు మరియు కాలమ్ క్రోమాటోగ్రఫీ మెటీరియల్‌లు కూడా ఈ సదుపాయంలో నిల్వ చేయబడతాయి. ఈ విభాగం లో బయోకెమికల్స్ మరియు ఇతర రసాయనాలు సరఫరా చేసే కంపనీల ప్రోడక్ట్ కేటలాగులు, ప్రోడక్ట్ సమాచార వివరాలు పరిశోధకులకు అందుబాటులో ఉంచబడుతుంది. అంతర్గతంగా తయారు చేయబడిన కంప్యూటర్ అప్లికేషన్ ద్వారా బయోకెమికల్స్ క్రయ, నిల్వ, వినియోగ లావాదేవీలు పూర్తిగా నిర్వహింపబడతాయి. ఈ విధానం వల్ల గిడ్డంగి వ్యవస్థ తక్కువ ఖర్చుతో, తక్కువ వృధాతో పని చేస్తుంది.

Notifications