చార్టర్ / సంఘ నిర్మాణ వ్యవహార నిబంధనలు

  1. Home
  2. /
  3. చార్టర్ / సంఘ...

ఆధునిక జీవశాస్త్రం మరియు దాని అనుబంధ శాస్త్రాల యొక్క నూతన పోకడల మీద పరిశోధనలను నిర్వహించడానికి మరియు వాటి ఫలితాలను నిత్య జీవిత సమస్యలకు సమాధానాలుగా వ్యక్తీకరించడం

దేశంలో బయోకెమికల్ మరియు బయోలాజికల్ టెక్నాలజీ అభివృద్ధికి తోడ్పడే ఉద్దేశ్యంతో జీవశాస్త్ర రంగాలలో పరిశోధనాత్మక పనిని నిర్వహించడం

అభివృద్ధి అవసరాలను తీర్చడం అనే లక్ష్యంతో జీవశాస్త్రం యొక్క అధునాతన అంశాలలో తత్సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ముఖ్యంగా తగిన సాంకేతిక వనరులు లేని ఇతర సంస్థల సిబ్బందికి స్వల్పకాలిక శిక్షణ పూర్తి స్థాయిలో ఏర్పాటు చెయ్యడం.

జీవశాస్త్రం యొక్క అనుబంధ శాస్త్ర రంగాలలో నూతన మరియు ఆధునిక సాంకేతికతలకు దేశంలో కేంద్రీకృత సౌకర్యాలను అందించడం మరియు ఈ సౌకర్యాలను దేశంలోని ఇతర ప్రయోగశాలలు మరియు సంస్థల పరిశోధకులు గరిష్టంగా ఉపయోగించుకునేలా నిర్వహించడం

CCMB యొక్క కార్యకలాపాలకు సంబంధించిన పరిసోధక అంశాలలో ప్రాథమిక లేదా సామాజికావసరాలకు అనువర్తిత పరిశోధనలు చేసే ఇతర సంస్థలతో పరస్పర సహకారం మరియు అభిప్రాయలు పంచుకోవడం

జీవ శాస్త్ర పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, క్రోడీకరించడం మరియు వ్యాప్తి చేయడం

Notifications